webnovel

22

1తండ్రీ కొడుకులు ఒకరి మోకాలు ఒకరు చూసుకొని ఫరీద వంక చూస్తారు.

ఫరీద:.... వీళ్ళు ఏదో ప్లాన్లు వేస్తున్నారు.. జోంబీలకంటే వీళ్ళే ప్రమాధకరం...

ఆమె పారిపోవాలని అనుకునే లోపలే వాళ్ళ నాన్న  ఆమె వీపుకున్న బాగుని పట్టుకొని ఆపేస్తాడు.

ఖాజా మస్తాన్: మీ అమ్మను వెతుకుదాం పదా!!... నీతో చాలా పనుంది!.

ఆమె బాగును పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తాడు.

షామీర్: హిహిహిహి....

ఫరీద: వీళ్ళ నుంచి ఎవరైనా నన్ను కాపాడండ్రా...

@@@@

ఖాజా మస్తాన్: మీ అమ్మ ఎక్కడ కనిపిస్తోందో చూడు!!

ఫరీద: చూస్తున్నా!!..

ఆమె ఎదురుగా ఉన్న స్క్రీన్ లో రంగు రంగుల డ్రాప్స్ లను గమనిస్తూ ఉంటుంది.

వాళ్ళ అమ్మ ఎక్కడుందో చూపించమని అడగగానే లోకేషన్ చూపిస్తుంది.

ఆమెకు తప్పా ఆ స్క్రీన్ ఎవరికీ కనిపించకపోవడంతో తనే వాళ్లకు దారి చూపిస్తూ ఉంటుంది.

ఫరీద: అమ్మ చివరిగా బస్లో వస్తున్నా అని చెప్పిందన్నవు కదా?

బస్సులోని వాళ్లు ఇన్ఫెక్ట్ అయి ఉండుంటారు. అమ్మ కూడా ఇన్ఫెక్షన్కి గురై ఉంటుందేమో. వెతకడం అవసరమా?!

ఆమె అలా అడగగానే తండ్రి, కొడుకులు చంపేస్తా అన్నట్టుగా ఉరిమి చూస్తారు.

ఫరీద: నేను ఇన్ఫెక్ట్ అయ్యానని అనిపించిగానే అబ్బా కొడుకులు నన్ను జోంబీల మీదకు తోసెయ్యబోయారు.. ఆవిడ మాత్రం ఇన్ఫెక్ట్ అయింది వదిలేద్దామా అనగానే చూడు ఎలా చూస్తున్నారో?..

పార్టీయాలిటీ!!.. అన్నిటిలోనూ పార్టీయాలిటీ!!..

అని గొనుక్కుంటూ ఉంటుంది.

షామీర్: ఏదో అంటునట్టున్నావ్?

ఫరీద: నీ బొందరా!! నీ బొంద!!!

అని చిరాకుగా అరుస్తుంది.

ఖాజా మస్తాన్: నోరుమూసుకుని పదా!! నీ గొంతు విని జోంబీలు మన వెంట పడతాయ్!!

ఫరీద: నాకేం పర్లేదు. నేను ఈజీగానే పారిపోతాను. మీరే.. హిహిహి...

అని అంటూ వెక్కిరిస్తూ నవ్వుతుంది.

షామీర్:  ప్రాణాలతో ఉంటే మాతోనే!! చస్తే మాతోనే!!!

అని ఆమెను ముందుకు నెడతాడు.

ఆమె చిరాకుతో వాడ్ని కాలితో పిర్ర మీద కొడుతుంది.

ఖాజా మస్తాన్: ఇద్దరినీ తంతా ఇప్పుడు!! మూస్కొని పదండీ!!

షామీర్:...

ఫరీద:...

@@@@

వాళ్లు ముగ్గురూ క్షేమంగా హైవే రోడ్డు మీదకు చేరుకుంటారు.

షామీర్ తన శక్తితో వాళ్ళ చుట్టూ ఒక షిల్స్ ఏర్పాటు చేస్తాడు.

వాళ్లు కదులుతుంటే అది కూడా కదులుతూ ఉంటుంది.

షీల్డ్ పగలకొట్టుకొని జోంబీలు వస్తే వాళ్ళ నాన్న గొడ్డలితో నరుకుతూ ఉంటాడు.

ఫరీద చెత్త ఏరుకునే దానిలా దారిలో దొరికిన బంగారం, వెండి వస్తువులు ఏరుకుంటూ ఉంటుంది.

ఫరీద: దీనికంటే గుడి మెట్ల దెగ్గర అడుక్కుటినడం మేలేమో...

ఆమె చొరకుతో ఏరిన వస్తువులను స్క్రీన్ లో ఇస్తూ ఉంటుంది.

Siguiente capítulo