webnovel

18

షామీర్ కేకలు వేస్తుంటాడు. వాడి కేకలు విని, వాళ్ళ నాన్న చేతిలో గొడ్డలితో పరుగులు తీస్తూ వస్తాడు.

ఫరీద: ఒడినీయమ్మ!.. ఈన నా తల నరికేస్తాడా ఇంటిప్పుడు?... ఆ....

ఆమె భయంతో కళ్ళు పెద్దవి చేస్తుంది. వాళ్ళ నాన్న ఆమె తల నరకడానికి ముందే ఆమె టైం స్టాప్ అయిపోతుంది.

ఫరీద: హా?.. మళ్లీనా?.. అంటే.. నేను చావుకి దెగ్గరలో ఉన్నప్పుడు టైం స్లో అయిపోతుందా?..

ఆమె వాళ్లిదరిని చూస్తూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి వేరే గోడ ఎక్కి కూర్చుంటుంది.

ఫరీద: జోంబీలు అంటే భయం పోయింది. వీళ్లిద్దరంటే దడ పుడుతోంది.

నేను జోంబీ కాను మూర్రో అంటున్నా పట్టించుకోవట్లా!!

నా కాలు... హా?..

ఆమె కాలు చూసుకోగానే అశ్చర్యబోతుంది.

ఆమె కాలికి చిన్న గీత కూడా ఉండదు. అంతే కాదు. ఆమె చేతికి కూడా ఎటువంటి గాయం ఉండదు.

ఫరీద: ఇదేంటి?.. నా చేతిమీద జోంబీ గోర్ల గీతలు ఉండాలి కదా? కాలి మీద పళ్ళ గాట్లు కూడా ఉండాలి కదా?.. ఎలా మాయం అయిపోయాయి?..

కొంపదీసి.. నేను జోంబీ దాడికి గురై చావడం వల్ల ఈసారి నాకు ఇమ్మ్యూనిటి, హీలింగ్ పవర్స్ దొరికాయా?

నాకు నమ్మకం కలగట్లేదు...

నేను చావు నుంచి తిరిగి రావడం ఏంటి? ఇలా శక్తులు పొందడం ఏంటి?..

మరీ ముఖ్యంగా నేను రాస్తున్న కధ లోనుంచి పత్రాలు బయటకు రావడం ఏంటి?..

ఆమె ఆలోచిస్తూ ఉంటుంది.

ఫరీద ఒక రైటర్. ఆమె కధలు రాస్తూ ఉంటుంది. తను రాసిన కధలో మొదటి కధ ఫరీద: నేనొక ట్రాన్స్మిగ్రేటర్.

ఆ కధ లోని పాత్ర ఆమె కళ్లెదురుగా వచ్చి నిలబడి మాట్లాడటం ఆమెకు ఆశ్చర్యానికి గురించేస్తుంది.

ఫరీద: ఒక్క నిమిషం...

ఆమె ఆలోచిస్తూ ఉండగా ఒక డౌట్ తలెత్తుతుంది.

అడుగులో అడుగు వేసుకుంటూ తన ఇంటికి వెళ్లి చేరుకుంటుంది.

చుట్టూ ఉన్న జోంబీలను పక్కకు తోసేసి, ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది.

ఆమె ఇల్లంతా గాలిస్తూ ఉండగా, ఒక వస్తువు దొరుకుతుంది.

అది తన మొబైల్ ఫోన్. ఫోన్ ఆన్ చేస్తుంది.

మొబైల్ ఆన్ చేయగానే ఫోన్ కాస్తా మాయం అయిపోయి ఎదురుగా ఒక పెద్ద నీలం రంగు స్క్రీన్ ప్రత్యక్షం అవుతుంది.

ఫరీద: ఒడినీయమ్మ!....

Siguiente capítulo