webnovel

14

ఖాజా మస్తాన్: మెంటల్ దానా!! అక్కడ నిలబడి ఏం చూస్తున్నావ్?! లగెట్టు!!

అని కోపంతో అరుస్తాడు. ఫరీదా తిక్క మొఖం వేసుకొని తల గోక్కుంటుంది.

ఫరీద: ఎటు పోను బాబా? నీకు తెలీదా? నేను పరిగెత్తలేను..

ఖాజా మస్తాన్: రే! కర్ర అందుకోరా!! దీనికి బ్రెయిన్ దొ@నట్టుంది!

పారిపో మంటుంటే మెంటల్ దానిలా నిలబడి ఉందిది!!

అని కోపంతో అరుస్తూ ఉంటాడు.

జోంబీలు అన్నీ అతని గొంతు విని ఖాజా మస్తాన్, షామీర్లను అందుకోవడానికి వాళ్ళ కింద చేరుకుంటాయి.

ఫరీద: అయ్యబాబోయ్!.. మా బాబుకి దొరికానంటే కచ్చితంగా నా వీపు పగలకొడతాడు..

22 ఏళ్ళ వయసులో ఈన చేత తన్నులు తినడం కంటే జోంబీల చేత కరిపించుకోడం నయం..

అని గొనుక్కుంటూ, జోంబీల వెనుక కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉంటుంది.

ఖాజా మస్తాన్ కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు.

ఖాజా మస్తాన్: రే!! నువ్వు శబ్దం చేస్తూ వీళ్ళని వేరే వైపు తీసుకెళ్ళు, నేను ఈ దద్దమ్మని జుట్టు పట్టుకొని లాక్కొస్తా!!

అని అంటూ నక్కుతూ, దాక్కొని ఫరీదా వైపుగా వెళుతూ ఉంటాడు.

షామీర్ వాళ్ళ నాన్న చెప్పినట్టుగా సౌండ్ చేస్తూ వాళ్ళిద్దరికీ దూరంగా వేరే వైపు ఉన్న రూఫ్ మీదకు వెళ్లి జోంబీల దృష్టిని అతని వైపుకి తిప్పుకుంటూ ఉంటాడు.

ఫరీద: ఇతనేంటి నా వైపు వస్తున్నాడు?.. వామ్మో.. జోంబీలకు చిక్కినా ఒక్కసారికి చంపేస్తాయ్!..

ఈనకు దొరికానంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు.. లగెట్టు ఫరీద...

అని గొనుక్కుంటూ, పారిపోవడానికి వెనక్కి తిరిగితుంది.

తిరిగే లోపే వాళ్ళ నాన్న కిందకు దిగి ఆమె నెత్తి మీద ఒక్కటిస్తాడు.

ఆమె తల రుద్దుకుంటూ నిలబడుతుంది. ఆమె చేతిలో నుంచి గొడ్డలిని పీక్కుంటాడు.

ఖాజా మస్తాన్: నేను వంగుతాను నా మీద కాలు పెట్టి గోడ ఎక్కు!! త్వరగా!!

అని చిన్నగొంతుతో అంటాడు.

తల రుద్దుకుంటూనే ఆమె సరే అంటూ తల ఊపుతుంది.

అతను గొడ్డలిని చేతిలో పట్టుకొని కిందకు వంగుతాడు.

ఆమె మెల్లగా కాలు పెట్టి గోడ ఎక్కడానికి ట్రై చేస్తుంది.

ఖాజా మస్తాన్: అబ్బా.... త్వరగా గోడ ఎక్కు!! నా నడుము ఇరిగేట్టుగా ఉంది!!

ఫరీద: ఎక్కుతున్నా బాబా... తిట్టకు..

ఖాజా మస్తాన్: నేను సంపాదించిందంతా నీ తిండికే అయిపోతోంది.

పందిలా తినకుండా ఒళ్ళు తగ్గించొచ్చుగా?!

ఫరీద: బాబా!! ఇప్పుడు మనం ఉన్న సిట్యుయేషన్ ఏంటి? నువ్వు అంటున్న మాటలు ఏంటి?

గట్టిగా మాట్లాడవో అవి వెనక నుంచి వచ్చి నీ పిక్క కొరికేస్తాయ్! చెప్తున్నా!!

Siguiente capítulo