webnovel

10

గ్రహం మొత్తం మీద సవాలు అన్నీ కుళ్ళిన దుర్వాసనతో నైరుతి నదిని పోలి ఉంటుంది.

అన్నీ చోట్లా హింస, అన్యాయం, అధర్మం, ఆకలి, బానిసత్వం, కరువు, వ్యభిచారం, అత్యాచారం, దొంగతనాలు, దోపిడీలతో అల్లకల్లోలంగా మారుతుంది.

మనుషులు ఒకరినొకరు చంపుకొని తినడం మొదలు పెడతారు.

4 లక్షల సంత్సరాలు పూర్తి కాక ముందే అంటు రోగాలతో అన్నీ జీవులు అంతరించిపోతాయి.

కల్కి అవతారం ఎత్తడానికి సమయం అవుతుంది..

అదే సమయంలో...

దేవలోకంలో ఒకరు అడుగు పెడతారు.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ధ్యానం నుంచి మేలుకొని కళ్ళు తెరుస్తారు.

అందరి పెదాల్లో చిరునవ్వు వస్తుంది.

దేవతలందరూ పరుగున వచ్చి ఒక చోటుకు చేరుతారు.

దేవతల ఎదురుగా ఆ వ్యక్తి నిలబడి అందరికీ నమస్కారం పెడతారు.

దేవతలు ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడుగుతారు.

"మీ రాకకు కారణం ఏమి మాతా?"

ఆమె ముసుగులో నుంచి బయటకు వస్తుంది.

"కాల చక్రాన్ని వెనక్కి తిప్పేటానికి మీ అనుమతి కోరడానికి వచ్చాను."

ఆమె అందరినీ గౌరవిస్తూ తల దించుకొని, చేతులు జోడించి చిరునవ్వుతో అనుమతిని అడుగుతుంది.

"కుదరదు అంటే?"

ఆమె పెద్దగా స్మైల్ చేస్తుంది.

"మీరు అంగీకరించడానికి సిద్ధంగా లేకుండా ఉండుంటే నాకోసం మీ విలువైన సమయాన్ని వృధా చేసే వారు కాదని నా అభిప్రాయం"

ఆమె గొంతులో భక్తి, గౌరవం తప్పా గర్వం, స్వార్థం ఏమీ కనిపించవు.

కొన్ని యుగాల సమయం వరకూ వాళ్లు అందరూ ఒకరితో ఒకరు చర్చించుకుంటూనే ఉంటారు.

ఆమె ఒక్క అడుగు కూడా కదలకుండా అదే ప్రదేశంలో, వాళ్లకు చేతులు మొక్కుతూ తల దించుకొని నిష్యబ్దంగా ఎదురు చూస్తూ ఉంటుంది.

ఆమె ధైర్యం, సహనం, గౌరవ మర్యాదలు మెచ్చి ఆమెకు అంగీకారాన్ని తెలుపుతారు.

ఆమె చివరిగా మోకాళ్ళ మీద కూర్చొని అందరికీ నమస్కారం పెట్టి అక్కడి నుంచి మాయం అయిపోతుంది.

ఇంద్రుడు: అడిగిన వెంటనే మానవులకు వారాలు ఇవ్వడం శుభము కాదని నా అభిప్రాయము త్రిమూర్తి..

అని నమస్కరిస్తూ పలుకుతాడు.

త్రిమూర్తులు చిరునవ్వు నవ్వుతారు.

"అసలైన ఆట ఇప్పుడే మొదలయ్యింది ఇంద్ర దేవా!"

Siguiente capítulo