ఏ జంతువు ఒంటి మీద కనిపించే గాయాలు ఏమీ కనిపించలేదు నాకు. కాకుంటే..
వేరే సమస్యలు నాకు కనిపించాయి..
సవ్యసాచి: ఏ సమస్యలు డాక్టర్ గారు?..
ఆమె తడబడుతూ గుటకలు మింగుతుంది.
డాక్టర్: నా దెగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదు గానీ, నేను పరీక్షంచగా తెలిసిందేంటంటే...
ఈ జంతువులు అన్నీ సీరియస్ డ్రగ్ ఎడిక్షన్కి గురయినట్టుగా ఉన్నాయి.
సవ్యసాచి: హా?... ఏంటి?...
బైరవ (పిల్లి), సవ్యసాచి ఇద్దరూ అశ్చర్యపోతారు.
సవ్యసాచి: డ్రగ్ ఎడిక్షన్ ఆ?...😨
@@@
ప్రదేశం: ల్యాబ్
వెన్నెల మెట్లు దిగి లోపలకు వెలుతుంది.
ఎదురుగా సైంటిస్ట్ సామాన్లు సర్దుతూ ఉంటాడు.
సైంటిస్ట్: విన్నీ!! ఈసారి ఎక్కడికెళ్లావ్?! సమయానికి కనిపించకుండా మాయం అయిపోతుంటావ్?!?
వెన్నెల: జంతువుల శవాలను ఎవరికీ కనిపించకుండా పాతిపెట్టడానికి వెళ్ళను సార్.
సైంటిస్ట్: హ్మ్! సరే!~ బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు!
మనం ఊహించ్చనప్పుడు ట్రాకర్స్ కనుక ఎదురుపడితే మన సంగతి అంతే!!
నీ నుంచి నా గురించి ఇన్ఫర్మేషన్ కుపీ లాగడానికి ఎంత దూరం అయినా వెళ్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు!!
వెన్నెల: అలాగే సార్. జాగర్తగా ఉంటాను.
అతను ఒక ల్యాబ్ రికార్డ్ బుక్ తీసుకోని నిలబడి చదువుతూ ఉంటాడు.
సైంటిస్ట్: పిచ్చెక్కిపోతోంది నాకు!!
అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది?..
అదే ఫార్ములాస్! అవే పద్ధతులు వాడాను కదా?!!
అయినా సరే ఫెయిల్ అవుతోందేంటి?!!
అవే ప్రొసీజర్స్ వాడాను! అయినా సరే విఫలం అవుతున్నాయి!
వెన్నెల: సార్, నాదొక ప్రశ్న.
సైంటిస్ట్: ఏంటి?
వెన్నెల: మీకు ఎదురయ్యిన ట్రాకర్ ఏ శక్తులు కలిగి ఉన్నాడు?
సైంటిస్ట్: అది ఒక అమ్మాయి. దుస్తుల వల్ల కనుగొన్నాను. దాని శక్తి వేగం!
నా కళ్ళముందే నా శాంపిల్ ని నా నుంచి దొంగలించుకొని పారిపోయింది!!
నేను వెంటపడుదాం అనుకున్నాను. కాని అది వేగంగా పారిపోవడంతో కుదరలేదు.
నేను కనుక దృష్టి పెట్టుంటే అది నా చేతికి చిక్కి ఉండేది! చేతిలో ఇసక జారినట్టు జారిపోయిందది!!
ఈసారి దొరికితే మాత్రం దాని చావు నేను అంత తేలికగా పారిపోనివ్వను!!
కచ్చితంగా దాన్ని నా చేతులతో చంపేస్తా!!
అని సీరియస్గా కోపం అనుచుకుంటూ చెబుతాడు.
వెన్నెల అతని వెనుక సైలెంటుగా తల దించుకొని ఆలోచిస్తూ ఉంటుంది.