webnovel

32

ప్రాణం పోయినా మస్తాన్ ను తప్పా ఎవరినీ పెళ్లి చేసుకొనని తెగేసి చెప్పేస్తుంది.

వాళ్లు కోపంతో ఫాతిమా చెంప మీద కొట్టబోతారు.

మస్తాన్ అడ్డుగా రాగ ఆ దెబ్బ అతనికి తగులుతుంది.

తను పేదవాడయినా ఫాతిమాను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పి, ఫాతిమా చెయ్యి పట్టుకొని తనతో తీసుకెళ్లిపోతాడు.

అలా వాళ్లు కట్టు బట్టలతో దూరంగా వెళ్ళిపోతారు.

మస్తాన్ ఇలాంటి రోజొకటి వస్తుందని ముందే ఉహించి ఉంటాడు.

తను సంపాదించిన డబ్బులు రోజూవారి అవసరాలకు పోగా మిగతా డబ్బులను జాగర్తగా బ్యాంకులో దాచి ఉంచుంటాడు.

గుడిలో దండలు మార్చుకొని, రిజిస్టర్ ఆఫీస్ లో ఆఫీషియల్గా భార్యా భర్తలుగా సర్టిఫికెట్ తెచ్చుకుంటారు.

తన జీతంతో ఫాతిమాను కాలేజుకి పంపిస్తూ చదివిస్తుంటాడు.

అలా చదువు పూర్తి చేసుకోని ఎక్సాంస్లో టాప్పర్ అవుతుంది.

ఆమె 11 నెలల వరకూ ట్రైనింగ్ కోసం వెళ్ళడానికి సిద్ధం అవుతుంది.

కలెక్టర్ అవ్వాలన్న ఆమె కలకు ఒకమెట్టు దూరంలో ఉన్న తనకు పిడుగు లాంటి వార్త తెలుస్తుంది.

తను 3 నెలల ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకుంటుంది.

ఇద్దరూ ఏం చేయాలో అర్ధం కాక బాధపడుతారు.

అటు వైపు ఇన్నేళ్ల చదువుని, పడిన కష్ఠాణ్ణి వదలలేరు.

ఇటు వైపు కడుపులో పెరిగే తమ బిడ్డనూ చంపుకోలేరు.

అలా ఇద్దరూ ఒకరోజంతా బాగా ఆలోచించుకొని ఒకే నిర్ణయానికి వస్తారు.

11 నెలల తరువాత,

***

హాస్పిటల్లో తమ ప్రేమకి చిహ్నంగా కూతురు పుడుతుంది.

తనే పర్వీన్.

మరో 3 ఏళ్లకు వాళ్లకు పండు కూడా పుడతాడు.

ఫాతిమా తన జీవితం తన కుటుంబం కోసమే అర్పించేస్తుంది.

మస్తాన్ తన భార్య తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని పక్కనే ఉండి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉంటాడు.

అలా తమ కధని ఇద్దరు పిల్లలకూ చెబుతుంది.

పర్వీన్ ఏడుపు ఆపేసి కళ్ళు తుడుచుకుంటుంది.

పర్వీన్: నీ కల నేను సాధించి చూపిస్తానమ్మ!

నేను కూడా నీలా బాగా చదువుకొని, కలెక్టర్ అవ్వాలన్న నీ కలను నిజం చేస్తానమ్మ!

అని చెబుతూ ఫాతిమాను కౌగిలించుకుంటుంది.

మస్తాన్ పండుని ఒడిలో కూర్చోబెట్టుని వాళ్ళిద్దరినీ చూస్తూ చిరునవ్వు నవ్వుతూ మురిసిపోతూ ఉంటాడు.

అప్పుడే ఎవరివో చెప్పట్లు వినిపిస్తాయి.

ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగా,

రాజ, రాజి, వల్లి, హర్షాలు వాళ్ళను చూసి చప్పట్లు కొడుతూ ఉంటారు.

...

హలో రీడర్. ఇక్కడి నుంచి

మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.

మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.

ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.