webnovel

26

వాన్ లోపల టేప్ తో ఒక పాకెట్ అతికించి ఉంటుంది. అందులో నోట్ల కట్టలు ఉంటాయి.

డబ్బుని చూసి వాళ్లు నవ్వుకొని, అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతారు.

వల్లి, రాజి, హర్ష, రాజ ఒక్కొక్కరూ ఒక్కో దిక్కున నిఘా ఉంచి ఉంటారు.

వాళ్లు వెళ్ళిపోగానే, చుట్టూ ఎవరూ లేరని కంఫర్మ్ చేసుకోని వాన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు.

@@@@

తెల్లవారుతుంది.

పర్వీన్ ఎప్పటిలాగే స్కూల్కి వస్తుంది.

స్కూల్ గేట్ ఎదురుగా వల్లి, రాజి, హర్ష, రాజాలు నిలబడి ఉంటారు.

స్కూల్ వాన్ గేట్ ముందు ఆగుతుంది. ఆమె వాన్ దిగగానే నలుగురూ ఎదురుచూస్తూ ఉండటం గమనించి స్మైల్ చేస్తుంది.

పర్వీన్: ఏంటి? స్కూల్కి ఇంత త్వరగా వచ్చేసారు?

హర్ష: ఇన్నిరోజులు స్కూల్కి వస్తే ఏంటి రాకుంటే ఏంటి అని ఉండేటోళ్ళం.

ఇప్పుడు నువ్వూ ఉన్నవుగా? నీకోసమే మేమంతా వెయిట్ చేస్తున్నాం.

సర్లే! ఆ బ్యాగ్ ఇటివ్వు!!

అని అంటూ ఆమె బ్యాగ్ తీసుకుంటాడు.

పర్వీన్ వాళ్ళను చూసి సంతోషపడుతుంది.

రాజ, పండు బ్యాగ్ తీసుకోని ముందుకి తగిలించుకొని, వెనకాల ఉప్పెక్కించుకుంటాడు.

అలా ఆ ఆరుగురు నడుచుకుంటూ క్లాస్ లోకి వెళ్లి పండుని దింపేసి, పర్వీన్ యొక్క క్లాసులో కూర్చుంటారు.

@@@

కాసేపు తర్వాత టీచర్స్ అందరూ హడావిడిగా ఆఫీస్ రూం నుంచి బయటకు వచ్చి అసెంబ్లీకి రమ్మని ఆర్డర్స్ వేస్తారు.

స్టూడెంట్స్ అందరూ వెళ్లి లైనుగా అసెంబ్లీలో నిలబడుతారు.

వాళ్ళ వాన్ 7:15am కి వస్తే స్కూల్కి చేరుకోవడానికి 7:30am అవుతుంది.

మిగతా ట్రిప్స్ వచ్చే వరకూ 8 అవుతుంది. 8:10am కి అసెంబ్లీ ఉంటుంది.

కానీ ఈరోజు మాత్రం 8 కూడా కాకుండానే ఇంత త్వరగా అసెంబ్లీ ఏంటని ఆలోచిస్తూ ఉంటుంది.

వైస్ ప్రిన్సిపాల్:..... *మైక్లో*

.... ఈరోజు క్లాసెస్ ఉండవు. సో స్టూడెంట్స్ అందరూ తాము తమ క్లాస్ రూంలోకి వెళ్లి సెల్ఫ్ స్టడీ చేస్తూ ఉండమని ఆర్డర్ చేస్తున్నాను.... టీచర్స్ మీరంతా ఆఫీస్ రూంకి రండి...

అంటూ స్పీచ్ ఎండ్ చేస్తాడు.

స్టూడెంట్స్ అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ క్లాసులకు వెళ్ళిపోతారు.

పర్వీన్ కూడా ఏదో ఆలోచిస్తూ తన క్లాసుకి వెలుతుంది.

.....

హలో రీడర్. ఇక్కడి నుంచి

మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.

మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.

ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి..

Siguiente capítulo