webnovel

9

రాజీ: మా నలుగురికీ మార్టియల్ ఆర్ట్స్ వచ్చు తెలుసా?!

అసలు నువ్వు అలా ఎలా హర్షాని కొట్టగాలిగావు?

హర్ష: అదే కదా?! నేనేంటి? ఇలా తన్నులు తినడం ఏంటి? నాకే అర్ధం కావట్లా!

అని చెబుతూ తల గోక్కుంటాడు.

ఆమె ఆలోచనల్లో పడుతుంది.

పర్వీన్: నిజం ఏమిటంటే.. నాక్కూడా తెలీదు.

ఆమె సమాధానం విని నలుగురూ బిక్క మోకాలు పెడతారు.

పర్వీన్: కోపంలో స్కూల్ బాగుని ఎత్తి నట్టుగా ఎత్తి, చెత్తను విసిరేసినట్టుగా విసిరేసేసా అంతే~

అని సింపుల్గా చెబుతుంది.

రాజీ, హర్ష, వల్లి ముగ్గురూ బిక్క మోకాలు పెట్టి ఆమెను చూస్తుంటారు.

రాజ ఆమెను చూసి స్మైల్ ఇస్తూ థంబ్స్ అప్ చూపిస్తాడు.

రాజీ చాలా కష్టబడుతూ నవ్వుని ఆపుకుంటూ ఉంటుంది.

వల్లి పర్వీన్ను కొట్టడానికి ఆమె మీదకు వెళ్ళడానికి ఎగురుతూ ఉంటుంది.

హర్ష ఆమెను వెనుక నుంచి చేతులతో పట్టుకొని ఆపుతుంటాడు.

పర్వీన్:.....

రాజీ ఇక నవ్వాపుకోలేక పొట్ట పగిలేలా పకపకా నవ్వేస్తుంది.

@@@

మాటిచ్చినట్టుగానే హర్ష పండుకి ఒక పెద్ద 5స్టార్ చాకలేట్ కొనిస్తాడు.

వాడు అన్నీ మర్చిపోయి చాకలేట్ నాక్కుంటూ తింటుంటాడు.

హర్ష: తిను!

అంటూ ఒక డైరీ మిల్క్ చాకలేట్ ఇస్తాడు.

పర్వీన్: నాకొద్దు!

అని చెప్పి, ఆమె తమ్ముడిని తీసుకోని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది.

హర్ష: ఎక్కడికి? రావడం పోవడం అంతా నీ ఇష్టమేనా?!

అని అంటూ ఆమెకు అడ్డుగా నిలబడుతాడు.

పర్వీన్ వాడిని నెట్టుకొని వెళ్ళిపోబోతుంది.

ఆమె చెయ్యి పట్టుకొని ఆపుతాడు.

హర్ష: ఎందుకంత కోపం? నేను వాడ్ని ఎందుకు కొట్టానో అడగనే లేదు నువ్వు!

పర్వీన్:....

ఆమె చేతులు కట్టుకొని నిలబడుతుంది.

హర్ష ఆమె సైలెన్స్కు అర్ధం ఆమె వినడానికి నిలబడిందని అర్ధం చేసుకుంటాడు.

ఆమెను తీసుకోని కూర్చోబెట్టి జరిగింది చెప్పడం మొదలు పెడతాడు.

హర్ష: వీడు ఇందాక వెళుతూ ఉన్నాడు. అప్పుడు...

***

పండు వాడి స్నేహితులతో ఆడుకుంటూ పరిగెడుతూ ఉంటాడు.

మిట్ట దెగ్గర హర్ష నిలబడి ఉంటాడు. పండు చూసుకోకుండా పరిగెట్టుకుంటూ వెళ్లి వాడికి గుద్దుకొని కింద పడిపోతాడు.

కింద పడటం వల్ల వాడికి అక్కడక్కడా గిసుకొని దెబ్బలు తగులుతాయి. యూనిఫార్మ్ కూడా మట్టి అంటుకుంటుంది.

వాడు గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు.

హర్ష వాడిని చొక్కా పట్టుకొని పైకి లేపి చిరాకులో మొట్టిక్కాయ్ వేసి తిట్టి పంపిస్తాడు.

పండు వాడి తిట్లు విని ఇంకుంచం గట్టిగా ఏడుస్తాడు.

అది చూసి పర్వీన్ వీళ్ళతో గొడవపడుతుంది.

పర్వీన్:... నిజమా?

అని పండుని అడుగుతుంది. వాడు 5స్టార్ చాకలేట్ కొనిచ్చినందుకు తృప్తిలో అన్నీ మర్చిపోయి నిజం అని చెప్పి, అవునని తల ఊపుతాడు.

పర్వీన్ తల పట్టుకుంటుంది. 🤦‍♀️

Siguiente capítulo