మహేంద్ర ఒక ఇంటర్ మీడియట్ స్టూడెంట్.
వయసు 20 ఏళ్ళ వయసు.
నల్లటి వెంట్రుకలు. 6 అడుగుల పొడవుంటాడు.
అతనికి చిన్నప్పటి నుంచి పోకెమోన్ అంటే చాలా ఇష్టం.
చదువులో ఆవరేజ్ స్టూడెంట్.
ఎప్పుడూ ఇతర అబ్బాయిలతో కలవకుండా తన ఊహా లోకంలో ఉండే వాడు.
హాలిడే అని ఇంట్లో కూర్చొని మొబైల్లో పోకెమోన్ చూస్తూ ఉంటాడు.
అతనికి సడన్గా తల నొప్పిగా అనిపిస్తుంది.
సరిడోన్ వేసుకొని మళ్ళీ ఫోన్ చూస్తూ ఉంటాడు.
ఫోన్లో పోకిమాన్ చూస్తూ ఉండగా ఫోన్ మీద ఎర్రటి చుక్కలు పడుతాయి.
మహేంద్ర: ఛా! ఎందిది?!
దాన్ని వేలితో తుడిచి ఫోన్ చూస్తూ ఉంటాడు.
అప్పుడు తప తపా ఎర్రటి చుక్కలు ఫోన్ మీద కారటం మొదలవుతుంది.
మహేంద్ర: హా??
అతని ముక్కు దురద పుడుతుండటంతో ముక్కు తుడుచుకుంటాడు.
మహేంద్ర:.. ర... రక్తం...?
మహేంద్ర చేతిలోని ఫోన్ జారి కింద పడి స్క్రీన్ పగిలిపోతుంది.
అతనికి మైకం వచ్చి కింద పడిపోతాడు.
మహేంద్ర కళ్ళు మెల్లగా మసకబారి పోతాయి.
కొన్ని క్షణాల్లో స్పృహ తప్పిపోతాడు.
శబ్దం ఏంటని మహేంద్ర వాళ్ళ నాన్న వచ్చి చూస్తాడు.
తీరా చూస్తే రక్తపు మడుగులో అతని కొడుకు పడి ఉండుంటాడు.
అతని గుండె ఆగినంత పనవ్వుతుంది. అతను గట్టిగా పిలుస్తూ పరిగెత్తుకొని వెళతాడు.
మహేంద్ర నాన్న: మహేంద్రా.....
అతని అరుపు విని అతని భార్య పెరట్లోనుంచి హాల్లోకి వస్తుంది.
మహేంద్ర అమ్మ: ఏమైదండి?
వాళ్ళ కొడుకు రక్తపు మడుగులో నేల మీద పడి ఉంటాడు.
ఆమె భర్త కంగారు పడుతూ మహేంద్ర పేరుని పిలుస్తూ ఉంటాడు.
ఆమె గుండె తడబడుతుంది.
ఇద్దరూ వేగంగా మహేంద్రను ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళతారు.
అన్నీ టెస్టులు చేసి ఫుల్ బాడీ స్కానింగ్ తీస్తారు.
అతనికి బ్రెయిన్లో ట్యూమర్ ఉందని అది సెకండ్ స్టేజికి వచ్చిందని డాక్టర్లు చెబుతారు.
ఆపరేషన్ చేసినా బ్రతికే అవకాశాలు తక్కువని చెప్పేస్తారు.
మహేంద్ర తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడుస్తారు.
కొన్ని రోజుల తరువాత, పేరు మోసిన డాక్టర్లు, సర్జనిస్ట్స్ అతని తలకి సర్జరీ చేస్తారు.
***
డోర్ అద్దం నుంచి రూంలోకి చూస్తారు.
మహేంద్ర ఆక్సిజన్ మాస్కుతో బెడ్ మీద పడుకొని ఉంటాడు.
ప్రస్తుతానికి మహేంద్ర ప్రాణాలకు ప్రమాదం లేదని, అతను కోమాలో ఉన్నాడని చెబుతాడు.
సృహలో నుంచి బయటకువస్తే తప్పా ఏం చెప్పలేమని అంటారు.
@@@@@@@@@
ఒక విశాలామైన పచ్చని గడ్డి ప్రదేశం.
*ధగ్ *ధగ్ *ధగ్ *ధగ్ *...
మంటూ భూకంపం వస్తూ ఉంటుంది.
మహేంద్ర చిరాకుతో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు.
ఒక్కసారిగా కళ్ళు తెరిచి చుడగానే ఏదో జంతువు అతని మీద నుంచి ఎగిరి దూకి పరిగెడుతూ వెళుతుంది.
అతని గుండె చప్పుడు తనకే వినిపిడుతుంది.
కంగారుతో పక్కకు జరుగుతాడు. అలా కిందకు దొర్లుకుంటూ వెళ్లి పడతాడు.
అతని భుజానికి రాయి తగులుతుంది.
నొప్పికి గట్టిగా అరుస్తాడు.
మహేంద్ర: ఆహ్.....
*పటపటపటపట* మని ఒక్కసారిగా పక్షులు అన్నీ గాల్లోకి ఎగురుతాయి.
అతను వాటిని చూసి అశ్చర్యంతో నోరేళ్లబెడతాడు.
అతని కల్లేదురుగా ఎన్నో వింత పక్షులు ఎగురుతూ కనిపిస్తాయి.
మహేంద్ర: పోకిమాన్స్...?
నేను మరో లోకానికి వచ్చేసానా?..