సవ్యసాచి: హా?.. హ?..
సవ్యసాచి కంగారు పడుతూ దిక్కులు చూస్తూ ఉంటుంది.
టీచర్: హా ఏంటి? పొద్దున్నుంచి క్లాస్లో పనుకునే ఉన్నావ్ నువ్వు.
సవ్యసాచి: అ-అవునా?
టీచర్: క్లాస్ ఇప్పుడే అయిపోయింది.
తన చుట్టూ క్లాస్ మేట్స్ చిన్నగా నవ్వుతూ ఉంటారు.
టీచర్: నువ్వు మంచి స్టూడెంట్ కనుక తిట్టకుండా వదిలేస్తున్న!
అని చెబుతూ క్లాస్ బోర్డు దెగ్గరకు వెళ్లి నిలబడుతారు.
టీచర్: వెన్నెల కాలేజ్ కి ఎందుకు రాలేదో మీలో ఎవరికయినా తెలుసా?
కాల్ కూడా అటెండ్ చేయడం లేదు.
మీలో వెన్నెల ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే తను కాలేజ్ కి ఎందుకు రాలేదో తెలిస్తే చెప్పండి.
క్లాస్ మొత్తం సైలెంటుగా ఉంటుంది.
టీచర్: తన ఫ్రెండ్స్ ఎవరూ లేరా? అవున్లే~ వెన్నెల ఈ మధ్యే కదా మన కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది~
సవ్యసాచి: వెన్నెల.... ఈరోజు ఆబ్సెంటా?...
అని ఆలోచిస్తూ వెన్నెల ఎప్పుడూ కూర్చునే బెంచ్ వైపు చూస్తుంది.
@@@
సాయంత్రం అవుతుంది.
కాలేజ్ అవడం వల్ల బెల్ కొడతారు.
స్టూడెంట్స్ అందరూ ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడుతూ వెళుతూ ఉంటారు.
సవ్యసాచి ముసి ముసిగా నవ్వుతూ కాలేజ్ రోడ్ సైడ్ నడుస్తూ ఉంటుంది.
సవ్యసాచి: కచ్చితంగా బైరవ నాకోసం ఎదురుచూస్తూ ఉండుంటాడు.
హిహి..
నేను ఉంచిన ఫుడ్ మొత్తం తినేసి ఉంటాడా? లేదా?
ఆ పిల్లి మేలుకుని ఉంటుందా? లేదా?
హహ్?
అని ఆలోచిస్తూ వెళుతుండగా ఆమె దృష్టి వేరే వైపు పడుతుంది.
అక్కడ కొందరు అబ్బాయిలు నిలబడి వెన్నెలను ర్యాగింగ్ చేస్తూ ఉంటారు.
"హే! నేను నిన్ను తీసుకుని రమ్మన్నాను కదా?"
"దాని బ్యాగ్ చెక్ చేయాండ్రా!"
ఒకడు ఆమె బ్యాగ్ లాక్కొని వస్తువులన్నీ కింద పడేస్తాడు.
అందులో మొత్తం క్యాట్ ఫుడ్ మాత్రమే ఉండి ఉంటుంది.
"దీనమ్మ!... పిల్లులు, కుక్కలు తినే తిండి బ్యాగ్లో పెట్టుకొని ఎవడే తిరిగేది?!"
"ఇదే ఇవన్నీ తింటదేమోలే మావా! హహహహ..."
వెన్నెల ఏమీ మాట్లాడకుండా సైలెంటుగా నిలబడుతుంది.
సవ్యసాచి కంగారు పడుతుంది. వాళ్లు వెన్నెలను అల్లరి చేయడం చూసి కూడా ఎవరూ సహాయం చేయడానికి రారు.
సవ్యసాచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లి వాళ్ళ ఎదురుగా నిలబడుతుంది.
సవ్యసాచి: వెన్నెల!! అక్కడేం చేస్తున్నావ్?..
అని అడగగానే అందరి దృష్టి సవ్యసాచి వైపు మళ్ళుతుంది.
"ఇదెవరు? నీ తోకా?"
"ఓయ్! అన్నీ మూస్కొని ఇక్కడి నుంచి దెం@య్!"
సవ్యసాచి: నేను వెళ్ళలేను.. తను నా క్లాస్మేట్..
వాళ్లు ముగ్గురూ ఆమె సమాధానం విని తెల్ల మోకాలు పెడతారు.
వాళ్లలో ఒకడికి కోపం వచ్చి సవ్యసాచిని కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు.