ఈ పిల్ల అతని వెనుక వచ్చి నిలబడి అతని ద్రుష్టి మదల్చి ఆతర్వాత ఆ అవకాశాన్ని తీసుకొని పిల్లిని తీసుకొని పారిపోవాలని అనుకుంటుందా?
కానీ అలా చేస్తే ఆమె శక్తి తగ్గిపోయి పారిపోవడానికి అవకాశం దొరకదేమో..
@@@
చుట్టూ వేగంగా గాలి వీస్తుంది.
"హ్మ్మ్?.."
అతని అడుగు ఆగుతుంది.
"హహ్?"
సవ్యసాచి అతని ఎదురుగా కూర్చొని పిల్లిని నేల మీద నుంచి జాగర్తగా చేతిలోకి తీసుకుంటుంది.
వేగం వల్ల ఆమె ముసుగు ఊడిపోతుంది.
ఏం జరుగుతోంది?
ఈ అమ్మాయి ఇక్కడికెలా వచ్చింది?
ఇప్పుడది ముఖ్యం కాదు!
ఎంత ధైర్యం ఉంటే నా ఎక్స్పెరిమెంట్ నే దొంగలించాలని అనుకుంటుంది?!
అతను కోపంతో సైకోకెనెటిక్ శక్తిని ఉపయోగించి ఆమె మీదకు వేగంగా దాడి చేస్తాడు.
అతని దాడికి ఆ ప్రదేశం అంతా ధ్వంసం అయిపోతుంది.
"హా? పారిపోయిందా?"
అతని దాడి తగలక ముందే ఆమె పారిపోతుంది.
"ఎటెల్లింది?.. క్షణం ముందు నా కల్లేదురుగానే ఉనింది?..
దీనమ్మ!..
ఆమె ట్రాకరా ఏంటి?..
ఛా! నా శక్తులతో ఆ పిల్లిని పిలవకుండా ఉండాల్సింది!..
తప్పు చేసానే!..
వీళ్ళు నాన్నింత త్వరగా కనిపెడతారని ఊహించలేదే...
సమయం లేదు!..
మిగతా ట్రాకర్స్ వచ్చే ముందే నేను ఇక్కడి నుంచి పారిపోవటం మంచిది!
అతను క్షణంలో ఆ ప్రదేశం నుంచి మాయమయిపోతాడు.
@@@
భైరవ: హా.. హా.. హా..
వాళ్లిద్దరూ వేగంగా పరిగెడుతూ ఉంటారు.
సవ్యసాచి చేతుల్లో గాయపడిన పిల్లి ఉంటుంది.
సవ్యసాచి: భైరవ! నేను సాధించాను! పిల్లిని కాపాడేసాను! చూసావా?
ఆమె ఆనందంగా చెబుతుంది.
భైరవ: ఓసినీ యాంకమ్మ! తొక్క సాధించావ్! నోరుమూసుకుని లగేత్తే! వాడికి కనుక చిక్కితే కోసి కారం పెడతాడు!
వాడు నీ మొఖం చూసేసాడు! నువ్వెంత ప్రమాదంలో ఉన్నావో నీకు కుంచం కూడా బుర్రకెక్కట్లా!
ఓయ్! నా గొంతు వినిపిస్తుందా లేదా?
ఆమె తన చేతిలోని పిల్లిని చూస్తుంది.
సవ్యసాచి: అయితే ఏం.. పిల్లిని ప్రాణాలతో కాపాడాను! అదే సంతోషం!.. హిహీ..
ఆమె ఆనందంతో నవ్వుతూ పరిగెడుతుంది.
భైరవ: ఏందే...
సవ్యసాచి: నావల్ల కాదేమో.. నేను కాపాడలేనేమో అనుకున్నాను. కానీ నావల్ల అయింది! నేను ఒక ప్రాణాన్ని కాపాడగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది.
భైరవ ఆమె మొఖం లోని ఆనందాన్ని చూసి అశ్చర్యబోతాడు.
భైరవ: నవ్వకే! తిక్కల్ దానా!
అబ్బబ్బా!... నిన్నెలా వేగాలో ఏంటో...
ఈ పిల్ల దాన్ని కాపాడుతుందని నేను కూడా ఉహించలేదు.
అది కూడా వాడి కళ్ళ ముందు..
సవ్యసాచి వేగం నేననుకున్న దానికంటే ఎక్కువే...
సవ్యసాచి: భైరవ! ఇలా చెప్పడానికి కుంచం సిగ్గేస్తుంది..
కానీ.. నాకు ఇలా సాహసం చేయడం చాలా నచ్చింది..
భైరవ: ఏం వాగుతున్నావ్?..
సాహసమా?...
కుంచం ఉంటే ఈ పిల్లకి పాడె కట్టాల్సొచ్చేది!!
అతను కోపంతో పళ్ళు కొరుకుతాడు.
సవ్యసాచి: నేను చిన్నప్పటి నుంచి అందరి నుంచి దాచాలనుకున్న నా శక్తులు అంత చెడ్డవి కావని ఈ రోజే తెలుసుకున్నాను.
అదే నమ్మకం, సంకల్పంతో ఈరోజు ఒక చిట్టి ప్రాణాన్ని కూడా కాపాడగలిగాను.
ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు చాలా ఆసక్తిగా అనిపిస్తోంది.
భైరవ: నోరుముయ్యహే! ఇక్కడ ఆసక్తి పడటానికేం లేదిక్కడ!
సవ్యసాచి: యాహు!...
భైరవ: నీ నోరు కుట్టేస్తా!...
*****
టేబుల్ మీద గట్టిగా పిడికిలితో కొడతాడు.
"ఛా! నా ఎక్స్పెరిమెంట్ నా కళ్లెదురుగా ఉండగానే పోగొట్టుకున్నాను!
అంత ముఖ్యమయిన శాంపల్..
విన్ని! (వెన్నెల నిక్ నేమ్) నన్ను ఒక ట్రాకర్ ఫాలో చేస్తున్నట్టున్నాడు!..
నేను కస్టపడి తయారు చేసిన నా సక్సెస్ఫుల్ సంపల్ని ఒకత్తి దొంగలుంచుకెల్లింది!..
అది ఏ టీం నుంచి వచ్చిందో తెలీదు!
వాళ్ళు నన్ను కనిపెట్టక ముందే ఈ ల్యాబ్ని ఖాళీ చేసేయాలి!
లేకుంటే దొరికి పోతాం!
నువ్వు కూడా జాగర్తగా ఉండాలి! ఎవరికీ అనుమానం కలిగించకు!"
వెన్నెల: అలాగే మాస్టర్.
ఆమె తల వంచుకొని సరేనని తల ఊపుతుంది.