webnovel

22

సవ్యసాచి: నేను వెళ్ళలేను.. తను నా క్లాస్మేట్..

వాళ్లు ముగ్గురూ ఆమె సమాధానం విని తెల్ల మోకాలు పెడతారు.

వాళ్లలో ఒకడికి కోపం వచ్చి సవ్యసాచిని కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు.

"నీలాంటి లం@#₹డ మమ్మల్ని ఏం చేస్తది?!"

అని చెంప మీద కొడతాడు.

ఆమె వేగంగా జరిగి దెబ్బ తగలక ముందే తప్పించుకుంటుంది.

వాడు అశ్చర్యంతో తెల్ల మొఖం పెడతాడు.

కోపం వచ్చి బూతులు తిడుతూ ఆగకుండా పంచులు విసురుతాడు.

ఒక్క దెబ్బ కూడా తగలకుండా ఆమె తప్పించుకుంటూ ఉంటుంది.

వాళ్లలో ఒకడు సవ్యసాచిని గమనిస్తూ ఉంటాడు.

ఇంకొకడు ఓపిక పోవడంతో ముందుకు వస్తాడు.

"ఏందిరా?! ఒక్కత్తిని కొట్టలేకున్నావా?! చేతకానోడా! ఉండు! నేనూ వస్తున్నా!"

అని ఆవేశంతో నడుచుకొని వెళ్లి ఆమెను కొట్టబోతాడు.

సవ్యసాచి ఇద్దరినీ సునాయాసంగా తప్పించుకొని అటూ ఇటూ జరుగుతూ ఉంటుంది.

"ఈ ము@డ నా దెబ్బల నుంచి తప్పించుంటూనే ఉందిది!!!"

"దీ@మ్మ!! ఉండే నీ పని చెప్తా!!"

అని ఇద్దరూ మరింత ఆవేశంగా దాడులు చేస్తారు.

కానీ ఒక్క దెబ్బ కూడా ఆమెను తాకదు.

వాళ్ళను చూసి చాలా మంది గుంపుగా చేరుతారు.

సవ్యసాచి: హలో! మీరు ఆగితే మంచిది.. చాలా మంది చూస్తున్నారు..

అటుగా వెళ్లే వాళ్లు:

'వీళ్ళు నడి రోడ్డు మీద గొడవలు పడుతున్నారేంటి?'

'ఈ కాలం పిల్లలున్నారే.... '

అని తిట్టుకుంటూ చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు.

"..."

"..."

"చేతకాని చవటళ్ళారా! ఏం చేస్తున్నార్రా?! నా పరువు మొత్తం తీస్తున్నారు!!"

అని మూడోవాడు కోపంగా అరుస్తాడు.

వాళ్లు ఇద్దరూ కుంచం భయపడి పక్కకు జరుగుతారు.

అతను జోబీల్లో చేతులు పెట్టుకొని ముందుకు వెళుతూ ఉంటాడు.

"ఓయ్!"

సవ్యసాచి: నేనా?..

"హా! నువ్వే!"

సవ్యసాచి: హ్మ్...?

"నువ్వే కదా, రోజూ వీధి పిల్లులకు ఫుడ్ పెడుతూ ఉండేది?!"

సవ్యసాచి: హా... నేనే... నీకెలా తెలుసు?...

అతను వెళుతూ వెనక్కి తిరిగి,

"నువ్వు జాగర్తగా ఉంటే మంచిది! ఇంకోసారి నిన్ను క్షమించి వదిలేదే లేదు."

అని చెప్పి, ముగ్గురూ వెళ్ళిపోతారు.

Next chapter