webnovel

11

"ఛా! దీనమ్మ! ఇంతేనా?

దీన్ని చూస్తుంటే మామూలు పిల్లులు కంటే బలమైన శరీరం కలిగి ఉంది..

కానీ మనిషితో పోలిస్తే ఇది చాలా బలహీనంగా ఉంది..

దీని పూర్తి శక్తి ఇంతేనా?.."

అతని కాలితో పిల్లిని తొక్కి పక్కకు తోస్తాడు.

**హిస్స్**

"ఓరినీ!.. నువ్వింకా స్పృహలోనే ఉన్మావా?.."

సవ్యసాచి తన పైటను సరి చేసుకొని మోకానికి కట్టుకుంటుంది.

సవ్యసాచి: ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు.

కానీ నేను ఆ పిల్లిని మాత్రం కాపాడాలను కుంటున్నాను.

తను చాలా గాయపడి ఉంది.. ఇలాగే వదిలేస్తే..

భైరవ: మెంటల్ దానిలా మాట్లాడకు!

సవ్యసాచి: కానీ భైరవ..

భైరవ: వాడు ఒక అవేకెనర్ అన్న సంగతి నీకు ముందే చెప్పాగా?

నీకు ఇప్పుడున్న శక్తితో అతన్ని ఓడించడం అసాధ్యం.

అతనికి చిక్కితే నీ మీద ఏమాత్రం జాలి చూపించకుండా చంపేస్తాడు.

సవ్యసాచి: నాకు తెలుసు! నాకు.. తెలుసు!..

కానీ అవేకెనర్ అయినంత మాత్రాన మూగ జంతువులని అనవసరంగా హించకూడదు కదా?

అతను తప్పు చేస్తున్నాడు.. చూసి కూడా నేను సైలెంట్గా తల వంచుకొని వెళ్లి పోవాలా?..

భైరవ: వెర్రిగా వాగడం ఆపు!

నువ్వు పిల్లిని కాపాడగానే వాడు నిన్ను ఊరికే వదిలేస్తాడా?

వాడు నిన్ను పట్టుకుంటే ఏం చేస్తావ్?

ఆ దిక్కుమాలిన పిల్లి కోసం నీ ప్రాణం అడ్డు పెడతావా?

భైరవ కోపంతో సవ్యసాచిని గట్టిగా తిడతాడు.

ఆమె తల వంచుకొని ఆలోచిస్తూ ఉంటుంది.

భైరవ: ఇన్నాళ్లు అవేకనర్ల గురించి తెలియకుండా బ్రతికావ్.

ఇప్పుడు తెలిసి కూడా అతనికి ఎదురు తిరిగి పోరడుతావా?

నువ్వు అతన్ని ఓడించగలనని అనుకుంటున్నావా?

నువ్వు ఆ కాట్ మాంస్టర్ తో పోరాడి గెలవగానే పెద్ద తోపనుకుంటున్నావా?

సవ్యసాచి! అతన్ని ఓడించడం నీకు సాధ్యం కాదు! నీ పరిస్థితి తెలుసుకో!

ఆమె తల వంచుకొని ఆలోచిస్తూ ఉంటుంది.

ఈ పిల్లకి ఇప్పటికయినా అర్థం అవుతుంది అనుకుంటా!

ఒక అవేకనర్ని ఎదిరించడం అంటే యముడికి హాయ్ చెప్పినట్టే నని అర్థం చేసుకోవాలి!

ఈ పిల్ల తన సొంత శక్తి గురించి తెలుసుకొని ఒక్క రోజు కూడా అవ్వలేదు.

అలాంటిది పుట్టుక నుంచి ట్రైనింగ్ తీసుకుని ఉన్న ఎదవలని ఒడించగలనని ఎలా అనుకుంతోంది?

ఈ పిల్లకి ఏం చూసుకొని ఇంత ధైర్యం?..

@@@

అతని ఎదురుగా ఉన్న పిల్లి వనుకుతూ మెల్లగా లేచి నించుంటుంది.

"ఇప్పటికయినా స్పృహ తప్పి పడిపోతుందా?

ఇక గొడవ పడలేదనుకుంటా~"

**హిస్స్**

"ఇది నన్ను చూసి పారిపోట్లేదేంటి? ఇలాగే బుసలు కొడుతూనే ఉంటుందా? ఇంకా ఎంతసేపు?.."

పిల్లి వేగంగా అతని నుంచి దూరంగా పరిగెడుతుంది.

అతను కొన్నింగా నవ్వుతాడు.

"అది కదా నాకు కావాల్సింది! నా నుంచి పారిపోవడం నీ వల్ల కాదు!"

పిల్లి పారిపోతూ ఉండగా సైకోకెనెటిక్ శక్తితో గాల్లోకి ఎత్తి నేలకేసి గట్టిగా కొడతాడు.

ఆ పిల్లి పూర్తిగా స్పృహ కోల్పోతుంది.

తన ఆకారం మామూలు పిల్లి స్థాయికి తగ్గి పోతుంది.

"ఎక్స్పెరిమెంట్ యొక్క పెరఫార్మెన్స్ నేను ఉహించిన దానికంటే బలహీనంగా ఉంది.

పర్లేదులే! కనీసం ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది. అది చాలు.

ఈ శాంపల్ తీసుకుని వెళ్దాం.."

@@@

సవ్యసాచి కోపంతో కళ్ళు ఎర్ర చేస్తుంది.

సవ్యసాచి:... ఒక మనిషి ఇంత కిరాతకంగా ఎలా ప్రవర్తించ గలుగుతున్నాడు?..

భైరవ! నా శక్తితో ఎలాగయినా ఆ పిల్లిని కాపాడటానికి ప్రయత్నించ బోతున్నాను!

భైరవ: ఏంటి? ఇప్పటిదాకా నేను చెప్పిందేది నీ మట్టి బుర్రకి ఎక్కలేదా?

సవ్యసాచి: నా శక్తులతో అతనితో గొడవ పడటానికి ప్రయత్నించను.

పిల్లిని కాపాడుతానంతే!

భైరవ: విషం తాగను! నోట్లో పెట్టుకుంటా అంతే! అన్నాడంట నీలాంటి ఎర్రి పుష్పం ఒకడు!

రెండిటికీ పెద్ద తేడా లేదు!

నువ్వు వేగంగా పరిగెత్తగలవు. కాకుంటే వాడు అవేకెండ్ అన్న విషయం మర్చిపోకు!

అవేకెన్ మనుషులు మామూలు మనుషులు కారు!

అచ్చం రాక్షసుల వంటి వారు!

అతను కచ్చితంగా నీ వేగాన్ని పసిగట్టి నిన్ను ఫాలో చేస్తాడు!

సవ్యసాచి: అం సారీ భైరవ. నువ్వు నా గురించి చాలా దిగులు పడుతున్నావ్.

భైరవ: ఏంటే... నేను? ఒకరి కోసం దిగులు పడటమ? అది కూడా నీలాంటి తిక్కల్ దాని కోసం? అస్సలు నిజం కాదు!

సవ్యసాచి: భైరవ! నువ్వు చెప్పింది నిజమే. నేను బలహీనురాలిని.

నా శక్తులు దేనికీ పనికి రావు.

అంతే కాదు. ఈ ప్రయత్నంలో నా ప్రాణమే కొలిపోవచ్చు!

కానీ...

నేను ఎలాగయినా ఆ పిల్లిని కాపాడాలి!

భైరవ:....

ఆమె వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతుంది.

భైరవ: హా?....

భైరవ గోడ వెనుక దాక్కొని తొంగి చూస్తూ ఉంటాడు.

ఈ తిక్కల్ది నేను ఎంత చెప్పినా వినకుండా వెళ్లి పోయిందే..

ఏం చేయాలనుకుంటోంది?

ఆ శాడిస్ట్ గాడు పిల్లికి అడుగు దూరంలో ఉన్నాడే..

Next chapter