webnovel

16

ఆమె కిటికీ నుంచి చూపు తిప్పుకొని, కారిడోర్ నుంచి నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది.

#######

*సవ్యసాచి ఇల్లు*

నల్ల పిల్లి సోఫా మీద పడుకొని ఉంటుంది.

మెల్లగా కళ్ళు తెరుస్తుంది.

కొత్త ప్రదేశంలో ఉండటము గమనించి అన్నీ దిక్కులు తల తిప్పి చూస్తూ ఉంటుంది.

పిల్లి: నేనెక్కడ ఉన్నాను? ఇదేం చోటు?

అని అనుకోని దిక్కులు చూస్తూ ఉండగా, నేల మీద మూడు పిల్లులు దొర్లుతూ ఆడుకుంటూ ఉండటం గమనిస్తుంది.

*meow*

*meow*

*meow*

తను మేలుకోవడం గమనించి, మూడు పిల్లులూ ఆడుకుందాం రా అని పిలుస్తూ ఉంటాయి.

ఎర్ర పిల్లి తన దెగ్గరకు వెళ్లి ఆడుకోవాలని తాకబోతుంది.

*meow*

నల్ల పిల్లి పక్కకు జరిగి కూర్చుని దెగ్గరకు రావొద్దని చెబుతూ కోపంగా బుసలు కొడుతుంది.

*hissss*

నల్ల పిల్లి బుసలు కొట్టడం చూసి మూడు పిల్లులూ ఒక్కసారిగా ఉలిక్కి పడుతాయి.

మూడు పిల్లులు నల్ల పిల్లి నుంచి దూరంగా పారిపోబోతాయి.

నల్ల పిల్లి వెంట పడుతుంది.

మూడు పిల్లులూ భయంతో వణుకుతూ ఒకేచోట నీలుక్కొని కూర్చుంటాయి.

నల్ల పిల్లికి కోపం వచ్చి బుసలు కొడుతూ వాటిని చంపడానికి  ఒక్కసారిగా మీదకు దూకుతూ పంజాలు విసరబోతుంది.

బండ పిల్లి శరీరంలో ఉన్న బైరవ పరిగెట్టుకుంటూ వచ్చి నల్ల పిల్లిని గాల్లో ఒక్క తన్ను తన్నుతాడు.

దెబ్బకి ఎగిరి సోఫాలో పడుతుంది. స్పృహ తప్పి పడుకుంటుంది.

బైరవ: విశ్వాసం లేని పిల్లి!!

అని తిడుతూ ఉండగా రెండు పిల్లులు కాపాడినందుకు థాంక్స్ చెపుతూ ఉంటాయి.

*meow*

*meow*

మరో పిల్లి సోఫా ఎక్కి నల్ల పిల్లిని కాలితో ఊపుతూ ఉంటుంది.

*పిల్లి: ఉన్నావా? పోయావా?

రెండు పిల్లులూ బైరవ ని ముద్దు చేస్తూ గుండ్రంగా తిరుగుతూ ఒళ్ళు రుద్దుకుంటూ ఉంటాయి.

*purrrr*

*purrrr*

బైరవ: ఎహే!!! దూరంగా పో!! నువ్వు కూడా!! ఇద్దరూ దూరంగా పొండెహే!!!

అని చిరాకుతో అరుస్తాడు.

అవి ఏమాత్రం పట్టించుకోవు. బైరవ ఇక సైలెంట్ అయిపోతాడు. అవి థాంక్స్ చెపుతూ ఒళ్ళు రుద్దుకుంటూ ఉంటాయి.

***

సవ్యసాచి అప్పుడే ఇంటికి వస్తుంది.

తలుపులు తెరిచి వస్తుంది.

సవ్యసాచి: నేనొచ్చేసా!!

సవ్యసాచిని చూడగానే మూడు పిల్లులూ పరిగెట్టుకుంటూ ఆమె దెగ్గరకు వెళ్లి ఆమె చుట్టూ తురుగుతూ ఉంటాయి.

బైరవ విసుగుతో వాళ్ళను చూస్తూ ఉంటాడు.

ఒక పిల్లి సవ్యసాచి బాగున్ని గొల్లతో గీకుతూ ఉంటుంది.

రెండు పిల్లులు సవ్యసాచి చేతులకు తల అనిస్తూ ముద్దు చేపించుకుంటూ ఉంటాయి.

సవ్యసాచి: ముగ్గురూ ఇక్కడే ఉన్నారా?? ఎలా ఉన్నారు?? ఏమైనా తిన్నారా లేదా??

*meow*

*purrrr*

*meow*

బైరవ వాళ్ళను దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు.

సవ్యసాచి: అన్నట్టు, బైరవ నేను ఇంట్లో లేనప్పుడు ఏమైనా తిన్నావా లేదా?

అతను సమాధానం ఇవ్వకుండా చూపు తిప్పుకుంటాడు.

బైరవ:.....

సవ్యసాచి: నీకు క్యాట్ ఫుడ్ నచ్చకున్నా తినాల్సిందే! లేకుంటే నీ ఆరోగ్యం చెడిపోతుంది! నువ్వు పిల్లి శరీరంలో ఉన్నంతకాలం పిల్లులు తినే ఫుడ్ తినడమే ఆరోగ్యానికి మంచిది, బైరవ!

బైరవ:.....

అతని వెనక తిని పడేసిన క్యాట్ ఫుడ్ కాన్లు చెల్లా చెదురుగా పడి ఉంటాయి.

సవ్యసాచి వాటిని గమనిస్తుంది.

సవ్యసాచి: హమ్మయ్య. ఏదోకటి తిన్నవాన్నమాట!~

నేను అనవసరంగా దిగులు పడ్డాను.

మార్చేపోయా!!...

ఆమె పైకి లేచి నల్ల పిల్లి దెగ్గరకు వెళుతుంది.

సోఫాలో పనుకుని ఉండటం చూసి దిగులు పడుతుంది.

సవ్యసాచి: తను ఇంకా ఎందుకు మేలుకోలేదు?... తనకేం కాలేదుకదా?.. నాకు చాలా దిగులుగా ఉంది.. ఒకవేళ ఎప్పటికీ లేవకుండా పోతే?...

బైరవ:...

అతను చూపు తిప్పుకొని చమటలు కారుస్తాడు.

సవ్యసాచి: తనకు ఒంట్లో బాగోలేదా ఏంటి?.. క్లినిక్కి తీసుకోని వెళితే మంచిదేమో?.. తన ఒళ్ళంతా చల్లపడిపోయింది...

అలా కావడానికి కారణం, బైరవ ఎగిరి తన్నడమేనని ఆ విషయం సవ్యసాచికి చెప్తే క్లాస్ పీకుతుందని కంగారు పడుతాడు.

బైరవ: అదీ... అదీ... అది ఇందాక ఒకసారి మేలుకుంది..

అది విని ఆమె చాలా సంతోష పడుతుంది.

సవ్యసాచి: నిజంగా?? ఎప్పుడు??

బైరవ: నువ్వు వచ్చిన నిమిషం ముందు...

సవ్యసాచి: హమ్మయ్య!!~~~ తను ఇక మేలుకోదేమోనని చాలా భయపడ్డాను.

బైరవ:.....

సవ్యసాచి: నువ్వు మేలుకున్నావన్నమాట!! చాలా సంతోషం!!

బైరవ: సవ్యసాచి, నాకు చాలా క్యూరిస్గా ఉంది. ఇవి వీధి పిల్లులు కదా? వీటిని నువ్వు ఇంట్లో పెంచుకోవట్లేదు కదా?

సవ్యసాచి: అవును. ఇవి వీధి పిల్లులే. నేను వీటిని ఇంట్లో పెంచుకోవట్లేదు.

బైరవ: మరైతే నీ ఇంట్లో పిల్లులకు వాడే సమాన్లు చాలా ఎందుకు ఉన్నాయి?

సవ్యసాచి: ఒకటని కారణం ఏమీ లేదు. నువ్వు ఇవన్నీ పట్టించుకోవని అనుకున్నా.

బైరవ: నాకు కూడా తెలుసుకోవాలని ఉంది.

సవ్యసాచి: హహహ... నా శక్తుల వల్ల నాకు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు.

మేము ఎప్పుడూ ఊర్లు మారుతూనే ఉండేవాళ్ళం.

నా శక్తుల గురించి ఎవరికయినా తెలిసిపోతుందేమోనని నేను అందరు పిల్లలకి దూరంగా ఉండే దాన్ని.

కానీ.. నాకు కూడా స్నేహితులు కావాలని ఆశ ఉండేది..

నా జీవితంలో మొదటిసారి స్నేహం చేసింది పిల్లితోనే...

తను కూడా ఒక వీధి పిల్లే. నేను ఎప్పుడు దిగులుగా ఒంటరిగా ఉన్నా నా పక్కనే ఉంటూ నన్ను ఓదార్చేది..

కానీ, ఒకరోజు తను కనిపించకుండా పోయింది. తన కోసం చాలా చోట్లు వెతికాను. కానీ కనిపించలేదు.

ఆతర్వాత మేము ఊరు వదిలి వచ్చేసాము. తనను చూడలేక పోయాను. బహుశా తనకి మంచి ఓనర్ దొరికి ఉంటారేమో అందుకే నా దెగ్గరకు రాలేదని అనుకున్నాను.

అప్పటి నుంచి వీధి పిల్లులు కనిపిస్తే ఫుడ్ కొని తినమని పెట్టే దాన్ని.

అలా వాటి కోసం క్యాట్ ఫుడ్, స్నాక్స్, బొమ్మలు కొనడం అలవాటయి పోయింది.

అవే ఇప్పుడు ఇంట్లో కుప్పలు తెప్పలుగా చేరిపోయాయి.

ఎప్పుడు పిల్లి కనిపించినా వాటికి ఫుడ్ పెట్టి కాసేపు ఆదుకోవడమే నేను చేస్తూ వచ్చాను.

పెద్ద గొప్ప స్టోరీ ఏమీ కాదు కదా?! హీహీహీ...

అతను చూపు తిప్పుకుంటాడు.

బైరవ:....

హా... పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదులే...

సవ్యసాచి: హా....

చాలా అలసటగా ఉంది..

క్లాసులో నిద్రపోయినా సరిపోలా...

ఇంకా నిద్ర మత్తు వదల్లా...

బైరవ: అవున్లే. నేను ఇచ్చిన శక్తిని మొత్తం వాడేసావ్ కదా!~ అందుకే నీ ఒళ్ళు అలసిపోయి ఉంటుంది.

దానితో పాటుగా రాత్రంతా మేలుకొనే ఉన్నావు.

సవ్యసాచి: హ్మ్.. అవును.. చాలా అలసటగా ఉంది.. మామూలుకంటే ఎక్కువగానే...

నువ్వు చెప్పింది నిజమే!! నేను చాలా అలసిపోయాను!! నేను రేపు తెల్లారేవరకు నిద్రపోతా!!

అని చెబుతూ గచ్చు మీద దిండు పెట్టుకోని పనుకుంటుంది.

బైరవ చూపు తిప్పుకొని పక్కకు వెళ్ళబోతాడు.

సవ్యసాచి: బైరవ గారూ..

బైరవ: హ్మ్?? ఏంటి??

సవ్యసాచి: నువ్విక్కడ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది..

ఇక్కడే ఉంటావా?... కనీసం నీ ఆరోగ్యం బాగయ్యే దాకయినా?...

ప్లేస్....

బైరవ:.... తూగింది చాలు! కళ్ళు మూసుకుని తొంగో!!

సవ్యసాచి: హీహీహీ...

బైరవ సోఫా మీదకు ఎక్కి కూర్చుంటాడు.

సవ్యసాచి: చాలా నిద్రొచేస్తుంది... హా....

అలా ఆమె మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది.

ఆమె పక్కన మూడు పిల్లులూ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాయి.

బైరవ: ఉఫ్....

Next chapter