webnovel

5

జంతువుల డాక్టర్: ప్రస్తుతానికి మందులు వేయాల్సిన అవసరం ఏమీ లేదు.

ఏమైనా అయినట్టు అనిపిస్తే క్లినిక్కి మళ్ళీ చెకప్ కి తీసుకురా.

సవ్యసాచి: సరే డాక్టర్ గారూ..

అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది.

*****సగం దూరం వచ్చాకా*****

కిందటి సారిలాగే మళ్ళీ పిల్లిని రగ్గుతో తన నడుముకి కట్టుకొని రోడ్డు పక్కన నడుస్తూ ఉంటుంది.

సవ్యసాచి: హమ్మయ్య... మనస్సాంతిగా ఉంది.

అని అంటుంది.

అంత మనస్సాంతి కలగడానికి ఏముంది?..

అని భైరవ తన మనసులో అనుకుంటాడు.

భైరవ: ఓయ్ పిల్లా! ఈ ఊరిలో కాట్ మాంస్టర్స్ ఏమైనా తిరుగుతూ ఉంటాయా?

సవ్యసాచి: హా? కాట్ మాంస్టర్సా? దేని గురించి మాట్లాడుతున్నావ్?...

హహ్?..

అదే సమయంలో ఆమె ఎడమ వైపు ఉన్న రోడ్ సందులో నుంచి ఒక పెద్ద పిల్లి మాంస్టర్ బయటకు వస్తుంది.

ఆమె పక్కకు తిరిగి చూడగా అది ఆమెకు స్పష్టంగా కనబడితుంది.

సవ్యసాచి: ఏంటది?... నువ్వు చెప్పిన పిల్లి మాంస్టర్ ఇదేనా?...

ఇది చూడటానికి పిల్లిలా లేదు.. పులిలా ఉంది..

అదే సమయంలో ఆ కాట్ మాంస్టర్ ఎర్రటి కళ్ళతో మతిస్థిమితం లేకుండా జొళ్లు కారుస్తూ గుర్రుమంటూ దిక్కులు చూస్తూ నడుస్తూ ఉంటుంది.

సవ్యసాచి: నువ్విప్పుడు పిల్లివి కాబట్టి నీకది పిల్లిలా కనిపిస్తుందేమో?..

భైరవ: నన్ను నమ్ము. నేను పిల్లిని కాబట్టి మరో పిల్లిని సులభంగా గుర్తు పట్టగలను.

ఆ ఆకారం చూస్తుంటే పులిలానే ఉంది.. కానీ అది పిల్లే.. కన్ఫర్మ్..

సవ్యసాచి: ఇప్పుడేం చేద్దాం?..

అదే సమయంలో వాళ్ళిద్దరినీ గమనించిన మాంస్టర్ కాట్ బుసలు కొడుతూ ఉంటుంది.

భైరవ: మాటలాపి లగేత్తే బాబూ!...

అని అరవగానే సవ్యసాచి దూరంగా పరుగులు తీస్తుంది.

భైరవ: పర్లేదే.. ఆ మాంస్టర్ని చూడగానే మమ్మీ అంటూ వణుకుతూ ఏడుస్తావనుకున్నా!

దూరంగా పారిపోవడం అనేది మంచి నిర్ణయమే.

కానీ ఈ వేగంలో పరిగెడితే ఆ కాట్ మాంస్టర్కి దొరికిపోవడం ఖాయం.

సవ్యసాచి పరిగెడుతూ ఉండగా వెనక్కి తిరిగి చూస్తుంది.

కాట్ మాంస్టర్ వాళ్ళిద్దరి వేగానికి సమానంగా పరిగెడుతూ వస్తూ ఉంటుంది.

అలా వేగంగా వచ్చి తన పంజాలతో సవ్యసాచి వీపు మీద దాడి చేస్తుంది.

తన నడుముకి కట్టుకొని ఉన్న రగ్గు చినిగి పోతుంది.

అలా వేగంగా వెళ్లి గోడకు గుద్దుకోని పడబోతుంది. పిల్లికి గాయం తగలకుండా వెంటనే భైరవని కౌగిలించుకుంటుంది.

అలా సవ్యసాచి వీపు గోడను గుద్దుకుని నేల మీద పడుతుంది.

తను నిదానంగా పైకి లేచి నిలబడుతుంది.

భైరవ: సవ్యసాచి, గట్టిగా దెబ్బలు తగిలాయా?

అని అడుగుతాడు.

సవ్యసాచి: నాకేం కాలేదు. అదృష్టవసాత్తు నా రగ్గు చినిగిందంతే..

ఇప్పుడేం చేద్దాం?..

అని తడబడుతూ అడుగుతుంది.

కాట్ మాంస్టర్ వాళ్ళ ఎదురుగా నిలబడి దాడి చెయ్యడానికి సిద్ధంగా ఉంటుంది.

భైరవ: ఈ సమయంలో ఆయుధం ఏదైనా ఉండుంటే బాగుండు...

సవ్యసాచి: హా?.. నా దెగ్గర ఒకటుంది.. నా ప్యాంటు జోబీలోనే పెట్టినట్టు గుర్తు...

భైరవ: ఈమధ్య అమ్మాయిలు కూడా ఆయుధాలు జోబీలో పెట్టుకు తిరుగుతున్నారా?.. హా?...

సవ్యసాచి వేగంగా తన జోబీలో నుంచి ఒక స్టిక్ తీస్తుంది.

సవ్యసాచి: మా దెగ్గరకు రావొద్దు!..

అని చెబుతూ ఆ స్టిక్కును అటూ ఇటూ ఊపుతుంది.

ఆ స్టిక్ మారేదో కాదు. పిల్లులను ఆడించే బొమ్మ స్టిక్కు. ఆ స్టిక్కి నైలాన్ దారం కట్టి దాని చివరన పక్షి రెక్కలతో చేసిన బొమ్మను అటాచ్ చేసి ఉంటుంది.

పిల్లి రూపంలో ఉన్న భైరవ, కాట్ మాంస్టర్ ఇద్దరూ ఓకే సమయంలో అశ్చర్యబోతారు.

భైరవ: నీకు పిచ్చా?.. దానితో ఏంచేద్దామని అనుకుంటున్నావ్?..

సవ్యసాచి:... ఇది తప్పా నా దెగ్గర వేరే ఆయుధం లేదే...

భైరవ: హహ్?...

అతని దృష్టంతా ఆ స్టిక్కుకు వేలాడుతున్న బొమ్మ మీదే ఉంటుంది.

కాట్ మాంస్టర్ ఆమె మీద దాడి చేస్తుంది.

సవ్యసాచి: వెనకకెళ్ళు!..

అని గట్టిగా కళ్లు మూసుకొని అరుస్తూ స్టిక్కును వేగంగా ఊపుతుంది. శబ్దం ఏమీ రాకపోవడం వల్ల కళ్లు తెరిచి చూస్తుంది.

సవ్యసాచి: హా?...

అని అశ్చర్యబోతుంది. కాట్ మాంస్టర్ ఆ బొమ్మను పట్టుకోవడానికి ఎగురుతూ ఉంటుంది.

సవ్యసాచి: ఇదే మనకు దొరికిన మంచి అవకాశం! లగెత్తు భైరవ!... భై... భైరవ....

ఆమె అశ్చర్యబోతుంది. ది గ్రేట్ భైరవ కూడా ఒక పిల్లిలా బొమ్మను అందుకోవడానికి గాలిలో పంజాలు విసురుతూ ఎగురుతూ ఉండటం అశ్చర్యకరం.

Next chapter